మతి స్థిమితం కోల్పోయి అదృశ్యం.. శేషాద్రి ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల ఆర్తనాదం

యల్లనూరు(yes9tv )జూలై 2:-మతి స్థిమితం కోల్పోయి అదృశ్యం.. శేషాద్రి ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల ఆర్తనాదం
యల్లనూరు మండలం సింగారం కొత్తపల్లికి చెందిన నల్ల పోతుల శేషాద్రి (46) ఈ నెల జూన్ 29 నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మతి స్థిమితం సరిగా లేకపోవడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి చేరుకోలేదని తెలిపారు.
శేషాద్రికి భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబానికి ఆయనే ప్రధాన ఆధారం కావడంతో ఆయన అదృశ్యమవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. బంధువులు, గ్రామస్తులు పరిసర ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా గాలింపు చేపట్టినా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లభించలేదు.
శేషాద్రి ఆచూకీ తెలిసిన వారు మానవతా దృక్పథంతో వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. సమయానికి అందే చిన్న సమాచారం కూడా ఆయనను కుటుంబ సభ్యులతో కలపడంలో ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:
9010876694, 9849255453.

Posted Under AP
Editor