రైలు ఢీకొని మగ ఎలుగుబంటి మృతి..

రైలు ఢీకొని మగ ఎలుగుబంటి మృతి

అనంతపురం జిల్లా, రాయదుర్గం నియోజకవర్గం: డి. హిరేహాల్ మండల పరిధిలోని బాధనహల్ గ్రామ సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బాదనహాళ రైల్వే ట్రాక్ హగరి వద్ద తెల్లవారుజామున ఒక మగ ఎలుగుబంటి రైలు ఢీకొని మృతి చెందింది.

సుమారు నాలుగేళ్ల వయస్సు గల ఈ ఎలుగుబంటి బాదనహాల్–హగరి బ్రిడ్జి సమీపంలో ట్రాక్ దాటే సమయంలో రైలుకు ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఎలుగుబంటి నీ కుంట మారేమ్మ నర్సరీ కి తరలించారు. అక్కడ అధికారుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం దహనం చేశారు.

ఈ కార్యక్రమంలో వెటర్నరీ వైద్యులు డా. సూర్యనారాయణ రెడ్డి, డా.రామచంద్రడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, దామోదర్ రెడ్డి డిఆర్ఓ, బీట్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యతో పాటు నాగేంద్ర, విశ్వనాథ్, శంకర్, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Posted Under AP
Editor