*అరవకూరులో వికసిత్ భారత్ – జి రామ్ జి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్..*
– *: పార పట్టి ఉపాధి హామీ పనులు చేసి కూలీల్లో స్ఫూర్తి నింపిన మంత్రివర్యులు పయ్యావుల కేశవ్..*
– *: ఉపాధి హామీ శ్రామికులతో ముచ్చటించిన మంత్రి..*
అనంతపురం, జులై 02 :
– *గ్రామీణ పేదల సాధికారత, సమగ్ర సంక్షేమం, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్, ఆజీవికా మిషన్ – గ్రామీణ్ (విబి జి రామ్ జి) పథకాన్ని గురువారం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం.. కూడేరు మండలంలోని అరవకూరు గ్రామ పంచాయతీలోని పని ప్రదేశంలో జిల్లా స్థాయిలో రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ లాంఛనంగా ప్రారంభించారు. అరవకూరు గ్రామ పంచాయతీలోని చెరువు కట్ట వద్ద కాలువలో కూడికతీత పనులను మంత్రి ప్రారంభించగా, మంత్రి స్వయంగా గడ్డపార పట్టి వికసిత్ భారత్ – జి రామ్ జి కింద ఉపాధి హామీ పనులు చేసి ఉపాధి హామీ శ్రామికులలో స్ఫూర్తి నింపారు. అనంతరం ఉపాధి హామీ శ్రామికులతో ముచ్చటించారు. మీకు రోజు ఎంత వేతనం వస్తుంది, వారికి అందుతున్న వేతనాలు, పనిదినాలు, కూలీ చెల్లింపుల విధానం, తదితర అంశాలను మంత్రి స్వయంగా అడిగి తెలుసుకున్నారు.*
– *ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ, ‘వికసిత్ భారత్ – జి రామ్ జి’ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల శ్రామికులకు సంవత్సరానికి 125 రోజుల వరకు మెరుగైన వేతనంతో ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, కూలి చెల్లింపులు సకాలంలో వారి ఖాతాల్లో జమయ్యేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ పథకం గ్రామీణ కుటుంబాల ఆర్థిక స్థితిగతులను బలోపేతం చేయడంతో పాటు, వారి జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. గ్రామ సభ ద్వారా వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళిక రూపొందించడం జరుగుతుందన్నారు. ‘వికసిత్ భారత్ – జి రామ్ జి’ పథకంను ఉపాధి హామీ శ్రామికులు ఉపయోగించుకోవాలన్నారు.*
– *ఈ కార్యక్రమంలో డ్వామా పిడి సలీమ్ భాష, ఏపీడి చెన్నకేశవులు, ఎంపీడీవో కుల్లాయి స్వామి, నాయకులు, ఉపాధి హామీ శ్రామికులు పాల్గొన్నారు.*
