గొప్ప గా యోగ అవగాహన ర్యాలీ
అనంతపురం నగరంలో అంతర్జాతీయ యోగ దినోత్సవము పురస్కరించుకొని యోగ అవగాహన ర్యాలీ ఈ రోజు ఉదయం 7 గంటల నుండి ప్రారంభమైంది.డిస్ట్రిక్ట్ రెవిన్యూ ఆఫీసర్ శ్రీ మలోల గారు , ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీమతి పద్మ శ్రీ,ఆయుష్ డిపార్ట్మెంట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ లాల్య నాయక్,డాక్టర్ తిరుపతి నాయుడు యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ అఫ్ అనంతపురము మరియు వివేకానంద యోగ కేంద్ర అధ్యక్షుడు ఎం .రాజశేఖర్ రెడ్డి, ఓంశాంతి సిస్టర్ శారద వీరు అందరూ జండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ అనంతపురము,వివేకానంద యోగ కేంద్ర , పతంజలి యోగ , బ్రహ్మకుమారిస్ ,ఆర్ట్ ఆఫ్ లివింగ్, సత్య సాయి ధ్యాన మండలి, రామ కృష్ణ సేవ సమతి,ఇషా ఫౌండేషన్, ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ ప్రెసిడెంట్ పుల్లారెడ్డి గారు వారి స్కూల్ విద్యార్థులతో పాటు మరియు ఇతర యోగ సంస్థలు అందరూ కలిసి పట్టణ ప్రజలకు యోగా యొక్క ప్రాముఖ్యతను తెలియజేయటానికి మరియు ఆదివారం జరగబోయే 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం లో పాల్గొనే యోగాంధ్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయటానికి ఈ రోజు ఉదయం 7 గంటల నుండి ఆర్ట్స్ కాలేజీ నుండి ర్యాలీని నిర్వహించారు .. డి ర్ ఓ శ్రీ మాలోల గారు యోగా యొక్క ప్రాముఖ్యతను దాని యొక్క ఆవశ్యకతను యోగా చేయుట వలన కలిగేటువంటి ప్రయోజనములు అందరికీ తెలియజేశారు మరియు ప్రతి సంవత్సరము అన్ని యోగ సంస్థలు ఐక్యంగా అవగాహన ర్యాలీని నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు. అదే విధంగా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ వారు విద్యార్థులను కూడా యోగా లో ఎన్సిసి మరియు ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కూడా పాల్గొనాలని తెలియజేసినారు . ర్యాలీ ఆర్ట్స్ కాలేజ్ నుండిబయల్దేరి టవర్ క్లాక్ , సప్తగిరి సర్కిల్ రాజు రోడ్డు శ్రీకంఠం సర్కిల్ ఎన్టీఆర్ విగ్రహం మీదగా ఆర్ట్స్ కాలేజీకి చేరుకున్నది . ఈ ర్యాలీలో పాల్గొన్నవారు యోగ యొక్క లాభములు, ఏ ఆసనం చేస్తే ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉంటుంది అన్ని విషయాలు ప్రజలకి చక్కగా మైక్ ద్వారా మరియు ప్లే కార్డ్స్ ద్వారా తెలియజేశారు . ఆదివారం జరిగే 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రోటోకాల్ పోలీసు పరేడ్ గ్రౌండ్ లో ఉదయం 6 గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతుందని మరియు ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని యోగ సంఘాల ప్రతినిధులు శ్రీయుతులు మురళి, రవి, మమతా, మారుతీ ప్రసాద్, దివాకర్, ఆంజనేయులు, రమేష్ బాబు విజ్ఞప్తి చేసారు. అంతే కాకుండా ఆదిత్య, చెన్నకేశవులు, గోవింద రెడ్డి, పుల్లయ్య, తారక్,సుశీల, పీడీ శ్రీరామ్ మొదలగువారు పాల్గొన్నారు
