Latest Posts

నిడిగల్లులో మండల స్థాయి ప్రకృతి వ్యవసాయ డెమో నిర్వహణ..

తాడిమర్రి (yes9tv )నిడిగల్లులో మండల స్థాయి ప్రకృతి వ్యవసాయ డెమో నిర్వహణ
వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు పీఎండీఎస్, డ్రాప్ ప్రూఫ్ మోడళ్లపై అధికారుల అవగాహన
తాడిమర్రి మండలం నిడిగల్లు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై మండల స్థాయి డెమో కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఖరీఫ్ సీజన్‌లో రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించేందుకు, వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పీఎండీఎస్ (PMDS) డ్రాప్ ప్రూఫ్ మోడల్, ఏ–1, ఏ–2, ఏ–3 నమూనాలపై క్షేత్రస్థాయిలో ప్రదర్శన చేపట్టారు.
ఈ సందర్భంగా విత్తన శుద్ధి, విత్తన పేలెటైజేషన్, విత్తన గుడికరణ వంటి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అధికారులు ప్రత్యక్షంగా రైతులకు చూపించి వివరించారు. శుద్ధి చేసిన విత్తనాలను పీఎండీఎస్ విధానంలో భూమిలో విత్తే ప్రక్రియను ప్రదర్శించారు.
మండల రెవెన్యూ అధికారి శ్రీమతి రెడ్డి లక్ష్మి, ఎంపీడీవో రంగారావు, మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఏపీఎం సాంబశివుడు, వ్యవసాయ, ఉద్యానవన, వెలుగు, అటవీ తదితర శాఖల అధికారులు పాల్గొని ప్రకృతి వ్యవసాయ విస్తరణకు తమ శాఖల నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ, దేవాదాయ, అటవీ మరియు ఇతర భూముల్లో కూడా పీఎండీఎస్, డ్రాప్ ప్రూఫ్ మోడళ్లను అమలు చేయాలని సూచించారు.
వెలుగు శాఖ ఆధ్వర్యంలో మహిళా సంఘాల నాయకులు, సభ్యులు గ్రామాల్లో మహిళా రైతులకు అవగాహన కల్పించి ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని నిర్ణయించారు. రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో వార్డు స్థాయి వరకు రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 300 నుంచి 500 ఎకరాల వరకు ప్రకృతి వ్యవసాయ విస్తరణ లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది నారాయణప్ప, రామాంజనేయులు, నబీ రసూల్, విస్తరణ అధికారి వైష్ణవి, రైతు సేవా కేంద్రాల ప్రతినిధులు, మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల సారాన్ని పెంపొందించి, తక్కువ నీటితో స్థిరమైన వ్యవసాయాన్ని సాధించవచ్చని అధికారులు రైతులకు వివరించారు.

Posted Under AP
Editor