Latest Posts

ప్రతి ఓటు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…

తాడిమర్రి( yes9tv )ప్రతి ఓటు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది
ఎస్‌ఐఆర్-2026లో ప్రతి పౌరుడి భాగస్వామ్యమే లక్ష్యం: టీడీపీ నాయకులు
తాడిమర్రి మండలంలోని నిడిగల్లు గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (SIR-2026)లో భాగంగా తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ కూచి రాము, సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోనుగుంట్ల భూషణ్ ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పించారు. ప్రతి ఓటు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి పౌరుడి భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఓటరు జాబితా పరిశీలన, కొత్త ఓటర్ల నమోదు, ఓటరు వివరాల్లో సవరణలు, మార్పులు-చేర్పులపై గ్రామ ప్రజలకు వివరించారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకుని తన ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రత్యేక సర్వే-2026 కార్యక్రమం ద్వారా ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రజలు తమ వివరాలను సరిచూసుకుని అవసరమైన మార్పులు ఉంటే వెంటనే తెలియజేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీఎల్‌ఓ రాజశేఖర్, బూత్ ఏజెంట్ రామానాయుడు, తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కాకర్ల చంద్రశేఖర్, యూనిట్ ఇన్‌చార్జ్ రాజశేఖర్‌తో పాటు గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Posted Under AP
Editor