Latest Posts

“ప్రజాదర్బార్” సమస్యల పరిష్కారానికి కృషి..

“ప్రజాదర్బార్” సమస్యల పరిష్కారానికి కృషి

– : రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్

– : అనంతపురం రామ్ నగర్ లో ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయంలో “ప్రజా దర్బార్” నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్..

అనంతపురం,జూన్ -19:

– అనంతపురం నగరంలోని రామ్ నగర్ లో ఉన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం “ప్రజా దర్బార్” కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ నిర్వహించారు. ఈ ప్రజాదర్బార్ కార్యక్రమంలో వివిధ రకాల ప్రజా సమస్యలపై ప్రజలు, నాయకుల నుంచి వినతి పత్రాలను మంత్రి పయ్యావుల కేశవ్ స్వీకరించారు. సమస్యలను పరిష్కరించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.

– ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు లాంటివని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తూ.. అనేక అభివృద్ధి పనులు చేయడం జరుగుతోందని, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లడం జరుగుతోందన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు, నాయకులు, ప్రజల సమస్యలను అర్జీల రూపంలో స్వీకరించి, ఎలాంటి ఆలస్యం కాకుండా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తక్షణం చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

Posted Under AP
Editor