శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం
- హిందూపురంలో శ్రీ పాంచ జన్య బ్రిలియంట్ పాఠశాలలో రోబోటిక్ ల్యాబ్ ప్రారంభం.
- మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున చేతుల మీదుగా ప్రారంభమైన ఫ్యూచర్ ఇన్నోవేటివ్ హబ్.
- రోబోటిక్, స్టెమ్, డ్రోన్ ల్యాబ్‌ను ప్రారంభించిన ఎంఈఓ గంగప్ప.
- విద్యార్థుల్లో ఇంజనీరింగ్ నైపుణ్యాల పెంపే ప్రధాన లక్ష్యం.
రోబోటిక్స్ ద్వారా ఆధునిక సాంకేతిక విద్యకు శ్రీకారం. - హిందూపురంలోనే అత్యాధునిక రోబోటిక్ ల్యాబ్‌గా పాంచ జన్య బ్రిలియంట్ పాఠశాలకు గుర్తింపు.
- భవిష్యత్ టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న పాఠశాల.
- నాణ్యమైన సాంకేతిక విద్య అందించడమే లక్ష్యమని కరస్పాండెంట్ శ్రీనివాసులు వెల్లడి.
- హిందూపురంలో తొలి అత్యాధునిక రోబోటిక్ ల్యాబ్ ప్రారంభం
హిందూపురం: విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలు, సృజనాత్మకత పెంపొందించేందుకు పట్టణంలోని శ్రీ పాంచ జన్య బ్రిలియంట్ పాఠశాలలో అత్యాధునిక ఫ్యూచర్ ఇన్నోవేటివ్ హబ్, రోబోటిక్, స్టెమ్, డ్రోన్ ల్యాబ్ను మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి గంగప్ప తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాసులు మాట్లాడుతూ, విద్యార్థులకు చిన్నప్పటి నుంచే ఇంజనీరింగ్ భావనలు, రోబోటిక్స్, స్టెమ్ విద్యపై అవగాహన కల్పించడమే ఈ ల్యాబ్ ఏర్పాటు ప్రధాన ఉద్దేశమన్నారు. భవిష్యత్ సాంకేతిక రంగ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకుఈల్యాబ్ఎంతోఉపయోగపడుతుందన్నారు.హిందూపురంలోనే అత్యాధునిక రోబోటిక్, డ్రోన్, స్టెమ్ సదుపాయాలు కలిగిన ప్రత్యేక ల్యాబ్‌ను తమపాఠశాలలో ఏర్పాటు చేసి, విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తున్నామని తెలిపారు.
బైట్స్:. 1)మల్లికార్జున మున్సిపల్ కమిషనర్.
2)శ్రీనివాసులు పాంచజన్య స్కూల్ మేనేజ్మెంట్
