రెండేళ్ల నమ్మకం…ప్రజల సంక్షేమం…అభివృద్ధి!
అనంతపురంలో N.D.A విజయోస్థవ సభ!
తరలిరావాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి!
———————————-
👉 వైసీపీ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ పరిపాలన వ్యవస్థలను దారుణనంగా దెబ్బతీశారు. N.D.A (National Democratic Alliance) రెండేళ్ల పరిపాలనలో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి మాన్యశ్రీ. నారా చంద్రబాబు నాయుడు గారు…వికాసం వైపు నడిపిస్తున్నారు. పరిపాలన వ్యవస్థల్ని గాడిన పెట్టి, ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందిస్తున్నారు.
👉 ఈ సందర్బంగా కళ్యాణదుర్గం శాసనసభ్యులు గౌ” శ్రీ. అమిలినేని సురేంద్ర బాబుగారి సూచనల మేరక, తేది.19-06-2026, శుక్రవారం, ఉదయం 10 గంటలకు , అనంతపురంలోని జాతీయ రహదారి పక్కన, కక్కలపల్లి రోడ్డు సమీపంలోని శ్రీ. నీలం రాజశేఖర్ రెడ్డి కన్వెక్షన్ సెంటర్ లో… N.D.A రెండేళ్ల పాలన విజయోస్థవ సభ నిర్వహిస్తున్నారు.
👉 ఈ సభలో రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, టీడీపీ ప్రముఖ నాయకులు పాల్గొంటారు.
👉 కావున, కుందుర్పి మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన, వివిధ రకాల హోదాల్లో వున్న టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, విజయోస్థవ సభకు విరివిగా తరలి రావాలని సవినయంగా కోరుతున్నాను.
ఇట్లు
G.ధనుంజయ,
కుందుర్పి మండల, టీడీపీ అధ్యక్షులు.
