అనంతపురం జిల్లా కలెక్టరేట్
*పారిశ్రామిక ఎగుమతులను ప్రోత్సాహించాలి*
– *జిల్లాలో పారిశ్రామిక ఎగుమతులను ప్రోత్సాహించాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో 69వ జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డిస్ట్రిక్ ఇండస్ట్రీస్ మరియు ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ) సమావేశం నిర్వహించారు.*
– *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు వచ్చే పారిశ్రామికవేత్తలను అన్ని రకాలుగా అన్ని శాఖల వారు ప్రోత్సహించి పరిశ్రమలు ఏర్పాటు చేసేలా మంచి వాతావరణం కలగజేయాలన్నారు. పరిశ్రమల స్థాపనకు త్వరితగతిన అనుమతులు అందజేసేలా చూడాలన్నారు. జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టము చేసేలా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి వారికి సకాలంలో సింగల్ డెస్క్ పోర్టల్ ద్వారా అన్ని రకాల అనుమతులను అందజేసి పరిశ్రమలు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏపిఐఐసి పారిశ్రామికవాడలలో వివిధ దశలలో వున్న పరిశ్రమల ఉత్పత్తిని వేగవంతం చేయలని జెడ్ఎంని ఆదేశించారు. ఇంకా ఉత్పత్తి ప్రారంభించని యూనిట్లను వెంటనే ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఏపిఐఐసి జెడ్ఎంని ఆదేశించారు. జిల్లాలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీలో 1 యూనిట్లకుగాను విద్యుత్ రాయితీ ఒక లక్ష్య 93 వేల 349 రూపాయలు, పెట్టుబడి రాయితీ కింద 9 యూనిట్లకుగాను 57 లక్షల 51 వేల 712 రూపాయలు సబ్సిడీ మంజూరుకు ఆమోదం తెలిపారు. ఈఓడిబి కింద వివిధ పరిశ్రమల స్థాపనకు అనుమతుల కోసం ఏప్రిల్ నుండి 91 దరఖాస్తులు అందగా, సింగల్ డెస్క్ విధానం ద్వారా 63 పరిశ్రమల కు అనుమతులు మంజూరు చేయగా, 5 దరఖాస్తులు తిరస్కరించగా, పెండింగ్ లో వున్న కాలుష్య నియంత్రణ మండలి పరిధిలోని 14 దరఖాస్తులు మరియు ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ లో వున్న 4 దరఖాస్తులను, తూనికలు, కొలతలు శాఖ పరిధిలో వున్న 5 దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా 2025వ సంవత్సరంలో జరిగిన భాగస్వామ్య సదస్సు మరియు ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదించిన పరిశ్రమల మీద సమీక్షించారు. అలాగే పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (NREDCAP) ఆమోదించిన ప్రాజెక్ట్ ల మీద అధికారులతో సమీక్షించి, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పారిశ్రామికవాడలలో మౌలిక వసతులు కల్పించాలని ఏపీఐఏసి జెడ్ఎంని ఆదేశించారు. పిఎం విశ్వకర్మ పథకము కింద అర్హులైన లబ్ధిదారులకు వెంటనే శిక్షణ ఇప్పించాలని జిల్లా శిక్షణ మరియు నైపుణ్యాభివృద్ధి అధికారిని ఆదేశించారు. జిల్లాలోని సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఉత్పాదకతను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాంప్ (RAMP) కార్యక్రమములో భాగంగా నిర్వహించాల్సిన ఉద్యమ్, ఈఎసిపి, విడిపి, జెడ్ తదితర కార్యక్రమాలను సమీక్షించారు.*
– *పరిశ్రమలు ద్వారా ఉత్పత్తి అయ్యే వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి అయ్యేలా చర్యలు చేపట్టాలని, ముఖ్యముగా జిల్లాలో ఉద్యానవన ఉత్పత్తులను మంచి ఎగుమతులుగా ఇతర దేశాలకు ఎగుమతి అయ్యేలా చర్యలు చేపట్టాలని ఉద్యానవన శాఖ అధికారిని మరియు జనరల్ మేనేజర్ ని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎగుమతిదారులు సప్తగిరి క్యాంఫర్ మేనేజర్ హనీఫ్, ముదర్ ఎక్స్పోర్ట్స్ సుధీర్ పలు సూచనులు చేశారు.*
– *ఈ సమావేశంలో డిఐసి జనరల్ మేనేజర్ నాగరాజ, ఏపీఐఏసి జెడ్ఎం నాగకుమార్, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాధాకృష్ణ, కమర్షియల్ ట్యాక్స్ ఏసిటీవో కృష్ణారెడ్డి, నాబార్డు ఏజిఎం అనూరాధ, జిల్లా హార్టికల్చర్ అధికారి ఉమాదేవి, ఎల్డిఎం మారుతి శ్రీనివాసులు, ఫ్యాప్సీ ప్రతినిధి శేషాంజనేయులు, డిఎస్డిఓ ప్రతాప్ రెడ్డి, ఏపీఎస్ఎఫ్సి బ్రాంచ్ మేనేజర్ హమీద్ అన్సారి, ఫ్యాఫ్సియ ప్రతినిధి నాగరాజు, దియా ప్రతినిధి రాజశేఖర్, డిపిఓ నాగరాజునాయుడు, జిల్లా పరిశ్రమల శాఖ ఏడి రాజశేఖర్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.*
