*రీసర్వే పనులను వేగవంతంగా చేపట్టాలి*
– *: పుట్లూరు మండలంలోని ఎల్లుట్ల గ్రామంలో, ఎల్లనూరు మండలంలోని బొప్పేపల్లి గ్రామంలో రీసర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జాయింట్ కలెక్టర్..*
– *రీసర్వే పనులను వేగవంతంగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం పుట్లూరు మండలంలోని ఎల్లుట్ల గ్రామంలో రీసర్వేలో భాగంగా గ్రౌండ్ ట్రూ థింగ్ పనులను జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు. అనంతరం ఎల్లనూరు మండలంలోని బొప్పేపల్లి గ్రామంలో రీసర్వే పనులను క్షేత్రస్థాయిలో జెసి పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో రీసర్వే పనులను చేపట్టడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని, పకడ్బందీగా రీసర్వేని చేపట్టాలని ఆదేశించారు. సకాలంలో రీసర్వే పనులను పూర్తిచేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఇందులో ఎలాంటి అలసత్వం ఉండరాదన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల రీసర్వే అధికారులు పాల్గొన్నారు.*
