రాయదుర్గం టెక్స్ టైల్ పార్క్ కు సంబంధించి జిల్లా స్థాయి సమావేశం నిర్వహణ….

అనంతపురం జిల్లా కలెక్టరేట్

రాయదుర్గం టెక్స్ టైల్ పార్క్ కు సంబంధించి జిల్లా స్థాయి సమావేశం నిర్వహణ..

అనంతపురం, జూన్ 18 :

– అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో గురువారం రాయదుర్గం టెక్స్ టైల్ పార్క్ కు సంబంధించి నాలుగవ జిల్లా స్థాయి సమావేశం జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో రాయదుర్గం టెక్స్ టైల్ పార్క్ లో ఇప్పటి వరకు యూనిట్ల స్థాపన కొరకు ప్రయత్నించని యూనిట్ దారులకు చివరిసారిగా నోటీసులను జారీ చేయాలని, స్పందించని వారికి కేటాయించిన ప్లాట్లను రద్దుచేసి ఇంకెవరైనా యూనిట్ల స్థాపనకు ముందుకు వచ్చిన వారికి కేటాయించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసి రాబోయే జిల్లా స్థాయి సమావేశములో సమర్పించాలని జిల్లా చేనేత మరియు జౌళి శాఖ అధికారిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా ఆహుడా కార్యాలయములో ఏవైనా అనుమతులు కావలసిఉన్నా ఆహుడా అధికారులతో స్వయంగా చర్చించి త్వరితగతిన అనుమతులు ఇప్పించాలని జిల్లా చేనేత మరియు జౌళి శాఖ అధికారిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా చేనేత మరియు జౌళి శాఖ అధికారి వరప్రసాద్, టెక్స్ టైల్ పార్క్ యూనిట్ దారులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor