అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మం.
కదరగుట్టపల్లికి చెందిన బాలుడు నవీన్ కుమార్ రెడ్డి SMA Type 1 (Spinal Muscular Atrophy) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యు లు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ వ్యాధి నయం కావడానికి రూ.17 కోట్ల ఇంజెక్షన్ అవసరం కావడంతో, కుమారుడిని బతికించుకోవడానికి తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
