బెంగళూరులో భయానక రోడ్డు ప్రమాదం..

  • బెంగళూరులో భయానక రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొట్టడంతో
  • గాల్లోకి ఎగిరిన బొలెరో, వీడియో వైరల్

ఎగిరిపోయిన బొలెరో.

కర్ణాటకలోని బెంగళూరు రూరల్ జిల్లాలో జాతీయ సీర-648పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న ఓ లారీ అదుపుతప్పి ముందుగా ట్రాక్టర్ను ఢీకొట్టింది. అనంతరం డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న మహీంద్రా బొలెరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.

ఢీకొన్న వేగానికి బొలెరో రోడ్డుపక్కకు ఎగిరిపడగా, ప్రమాద తీవ్రత చూసిన స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. పలువురికి గాయాలు కావడంతో వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు కాగా, ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Posted Under AP
Editor