అనంతపురం జిల్లా గుత్తి
గంజాయి, ఫేక్ నోట్ల విక్రయదారుల అరెస్ట్….
అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివారులో మంగళవారం గంజాయి, ఫేక్ నోట్ల విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.ఈ సందర్భంగా సీఐ రామారావు మాట్లాడుతూ. పెద్దవడుగూరు మండలం గుత్తి-అనంతపురం గ్రామానికి చెందిన గోపాల్, దిమ్మగుడికి చెందిన బద్రి అనే వ్యక్తులు గుత్తికి చెందిన రమేష్ అనే వ్యక్తికి గంజాయి మరియు ఫేక్ నోట్లు అందించేందుకు వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందిందన్నారు.దీంతో పోలీసులు నిఘా ఏర్పాటు చేసి వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
నిందితుల వద్ద నుంచి 20 గ్రాముల గంజాయి, 147 పేపర్ నల్ల కాగితాల ఫేక్ నోట్లలను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు వెల్లడించారు.అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా,న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.
