సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ నుంచి సరైన విధంగా మందులను పంపిణీ చేయాలి:జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్

సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ నుంచి సరైన విధంగా మందులను పంపిణీ చేయాలి

– : జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్

– : అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఎరువుల షాపులను, సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ ని, రాప్తాడు మండల కేంద్రంలోని 1వ సచివాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..

అనంతపురం, జూన్ 09 :

– సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ నుంచి సరైన విధంగా మందులను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం అనంతపురం నగరంలోని ఏపీఎంఎస్ఐడీసీ ఆధ్వర్యంలోని సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి, పలు ఫైల్స్ ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ నుంచి అన్ని పీహెచ్సీలు, సిహెచ్సిలు, ఏరియా ఆస్పత్రులకు, జిల్లా ఆస్పత్రులకు స్టాకు ఉన్నంతవరకు సరైన విధంగా మందులను పంపిణీ చేయాలని ఆదేశించారు. మందులు సరిగా సరఫరా చేయడం లేదని పీహెచ్సీల వారు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలుపగా, డ్రగ్స్ స్టోర్ లో ఉన్న మందులు అన్నిటిని సరఫరా చేస్తున్నామని అధికారులు తెలుపగా, ఎప్పటికప్పుడు స్టాక్ పంపించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.

నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఎరువుల షాపులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ :

– అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న గ్రోమోర్, లక్ష్మీరంగా, శ్రీ లక్ష్మీ ట్రేడింగ్ కార్పొరేషన్ ఎరువుల దుకాణాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా ఎరువుల దుకాణాల్లో ఏపీఏఐఎంఎస్ అప్లికేషన్ ద్వారా ఎరువుల పంపిణీ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలన చేశారు. ఎరువుల పంపిణీ సక్రమంగా చేపట్టాలని ఆదేశించారు.

రాప్తాడు-1వ సచివాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ :

– రాప్తాడు మండల కేంద్రంలోని రాప్తాడు-1వ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్షర ధార కార్యక్రమం, ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) పురోగతి తక్కువగా ఉందని, వేగవంతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చెన్నకేశవ, అడల్ట్ ఎడ్యుకేషన్ అధికారులు, ఎంపిడిఓ, తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor