శ్రీ సత్యసాయి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత: 53 కిలోల గంజాయి, కారు స్వాధీనం.. ఒకరు అరెస్ట్!

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం లో భారీ గంజాయి పట్టివేత.. పోలీసుల కీలక ఆపరేషన్
గంజాయి అక్రమ రవాణా కేసులో ఒకరు అరెస్ట్.
మీడియాకు కేసు వివరాలు వెల్లడించిన డి.ఎస్.పి..

జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి నేతృత్వంలో ఉక్కుపాదం మోపుతున్న శ్రీ సత్య సాయి జిల్లా పోలీసు శాఖ మరో కీలక విజయాన్ని సాధించింది.

ఈ కేసు వివరాలను, పుట్టపర్తి ఇన్చార్జి డిఎస్పి శివనారాయణ స్వామి, నల్లమాడ సిఐ శ్రీనివాసులు గారితో కలిసి మంగళవారం సర్కిల్ కార్యాలయంలో మీడియా సమావేశంలో వివరాలు తెలియజేశారు.

నల్లమాడ మండలం, కదిరి–బెంగళూరు జాతీయ రహదారి (NH-716G)లోని పులగంపల్లి క్రాస్ సమీపంలో గోరంట్ల వైపు ఒక కారులో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం అందడంతో, జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పుట్టపర్తి డీఎస్పీ (ఇన్‌ఛార్జ్) శివనారాయణ స్వామి పర్యవేక్షణలో నల్లమాడ సీఐ. వి. శ్రీనివాస్ నేతృత్వంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈ క్రమంలో నల్లమాడ ఎస్‌ఐ. ఎం. సతీష్ మరియు సిబ్బంది సమక్షంలో ఉదయం సుమారు 10:30 గంటలకు కదిరి వైపు నుంచి వస్తున్న AP39 SA 7507 నంబర్ గల Hyundai Verna కారును ఆపి తనిఖీ చేశారు. వాహనం డిక్కీలో ఉన్న రెండు మూటలను పరిశీలించగా వాటిలో గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు.
వాహనాన్ని నడుపుతున్న బి. వెంకట రమణ (25), తండ్రి బి. రామచంద్ర, రెడ్డివారిపల్లి గ్రామం, చారుపల్లి, నల్లమాడ మండలం ను అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు నిర్ధారణ అయింది.
పోలీసులు నిందితుడి వద్ద నుంచి 24 ప్యాకెట్లలో సుమారు 53 కిలోల గంజాయి, Hyundai Verna కారు మరియు ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
విచారణలో ఈ గంజాయి రెడ్డివారిపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు నిందితుడు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మల్లికార్జునను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఈ మేరకు నల్లమాడ పోలీస్ స్టేషన్ క్రైం నెం. 37/2026, సెక్షన్ 8(c) r/w 20(b)(ii)(B) NDPS Act కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
స్వాధీనం చేసుకున్న సొత్తు
* 24 ప్యాకెట్లలో సుమారు 53 కిలోల గంజాయి
* AP39 SA 7507 నంబర్ గల Hyundai Verna కారు
* ఒక మొబైల్ ఫోన్
అరెస్ట్ చేసిన నిందితుడు
* బి. వెంకట రమణ (25), తండ్రి బి. రామచంద్ర, రెడ్డివారిపల్లి గ్రామం, చారుపల్లి, నల్లమాడ మండలం
ఇంకా అరెస్ట్ చేయవలసిన నిందితుడు
* మల్లికార్జున, రెడ్డివారిపల్లి గ్రామం, చారుపల్లి, నల్లమాడ మండలం.
ఈ సమావేశంలో ఇంచార్జ్ డిఎస్పి గారితో పాటు, నల్లమాడ సి ఐ శ్రీనివాసులు, ఎస్ఐ సతీష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నరు

Posted Under AP
Editor