రైతులకు నాణ్యమైన ఎరువులు సకాలంలో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

అనంతపురం జిల్లా శింగనమల

రైతులకు నాణ్యమైన ఎరువులు సకాలంలో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

– : అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ

అనంతపురం గార్లదిన్నె జూన్ 08 :

– *వ్యవసాయ సహకార సంఘాల బలోపేతం, రైతులకు నాణ్యమైన ఎరువులు సకాలంలో అందించడమే ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోందని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

సోమవారం గార్లదిన్నె మండలంలోని జంబులదిన్నె పీఏసిఎస్ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని ఎడిసిసి బ్యాంకు చైర్మన్ కేశవరెడ్డితో కలిసి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ప్రారంభించడం జరిగింది.*

– ఈ సందర్భంగా రైతు సోదరులతో ఎంపీ మాట్లాడి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన (PMDDKY) ద్వారా అనంతపురం జిల్లా వ్యవసాయ రంగానికి గణనీయమైన మేలు చేకూరనున్న విషయాన్ని వివరించారు. రైతులపై భారం తగ్గించేందుకు యూరియా, డీఏపీ ఎరువులపై కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని, APAIMS యాప్ ద్వారా ఎరువుల లభ్యత వివరాలను తెలుసుకోవాలని ఎంపీ సూచించారు.

– గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనంతపురం జిల్లాను, ఆంధ్రప్రదేశ్‌ను “ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా”గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందన్నారు. జిల్లాలో సాగునీటి కాలువల విస్తరణ, ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహం, అనంతపురం జిల్లా ప్రత్యేకతను దేశ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించడం, తాడిపత్రి నుంచి గల్ఫ్ దేశాలకు అరటి ఎగుమతులు, జిల్లాలో కోల్డ్ స్టోరేజ్‌ల ఏర్పాటు, త్వరలో కార్గో ఎయిర్‌పోర్టు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా రైతాంగానికి మరింత బలం చేకూర్చే దిశగా కృషి చేస్తున్నామన్నారు. విశాఖపట్నాన్ని రైల్వే జోన్‌గా అభివృద్ధి చేయడం వంటి కీలక నిర్ణయాలతో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అన్నదాత సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం… రైతు అభ్యున్నతే రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది అని ఎంపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆలం నరసానాయుడు, పాండు రంగనాయకులు, గేట్ కృష్ణారెడ్డి, నీటి సంఘాల అధ్యక్షులు శేఖర్, ఏపీసిఓబి బ్యాంకు జిల్లా అధికారులు, గార్లదిన్నె మండల నాయకులు, రైతు సోదరులు, తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor