ఎన్టీఆర్ ట్రోఫీ KCL-3 విజేత సోమాలపురం జట్టు..

అనంతపురం జిల్లా, రాయదుర్గం.

ఎన్టీఆర్ ట్రోఫీ KCL-3 విజేత సోమాలపురం జట్టు

రాయదుర్గం, జూన్ 5: డి .హీరేహాళ్ మండల పరిధిలోని సోమాలపురం గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ ట్రోఫీ KCL-3 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో సోమాలపురం జట్టు విజేతగా నిలిచింది. మండల స్థాయిలో కల్యం, సోమాలపురం జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోటీని రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ఆసక్తిగా తిలకించారు.
రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో సోమాలపురం జట్టు అద్భుత ఆటతీరుతో ఛాంపియన్‌గా నిలవగా, కల్యం జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు విజేతలైన సోమాలపురం జట్టుకు ఎన్టీఆర్ కప్‌తో పాటు రూ.20,000 నగదు బహుమతిని, రన్నరప్ కల్యం జట్టుకు రూ.10,000 నగదు బహుమతిని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఇటువంటి క్రీడా పోటీలు ఎంతో దోహదపడతాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొన్న అన్ని జట్ల క్రీడాకారులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మోహన్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ యు. హనుమంత్ రెడ్డి, ఎంపీటీసీ మొండి మల్లికార్జున,ఎస్సై గురుప్రసాద్ రెడ్డి, దోడగట్ట రామాంజనేయులు ,శ్రీరాములు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు క్రీడాభిమానులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor