జనతా వారధిలో ప్రజా సమస్యలపై బీజేపీ నాయకుల స్పందన.

అనంతపురం జిల్లా రూరల్

జనతా వారధిలో ప్రజా సమస్యలపై బీజేపీ నాయకుల స్పందన

అనంతపురం, జూన్ 5: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేసే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమం శుక్రవారం అనంతపురం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఇంచార్జ్, జనతా వారధి రాయలసీమ జోనల్ ఇంచార్జ్ కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రజలు, పార్టీ శ్రేణుల నుంచి అందిన పలు అర్జీలను జిల్లా అధ్యక్షులు కొనకొండ్ల రాజేష్, రాష్ట్ర అధికార ప్రతినిధి దుద్దకుంట వెంకటేశ్వర రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి కలిసి పరిశీలించారు.

అనంతరం సంబంధిత శాఖల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ప్రజల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను సానుకూలంగా పరిశీలించి, పరిష్కార మార్గాలను అన్వేషించడం జనతా వారధి కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి దుద్దకుంట వెంకటేశ్వర రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి, జనతా వారధి జిల్లా కన్వీనర్ యల్. నాగేంద్ర, జిల్లా ఉపాధ్యక్షులు మారుతీ ప్రసాద్, సీనియర్ నాయకులు మల్లారెడ్డి, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు శివ తేజేశ్వర్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బెస్త శివ ప్రసాద్, కార్యదర్శులు నేత్రావతి, నరేంద్ర, మీడియా కన్వీనర్ దిలీప్ రాజా, మండల అధ్యక్షులు చాణిక్య, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor