ప్రకృతి పరిరక్షణ సామాజిక బాధ్యత..

అనంతపురం జిల్లా, కలెక్టరేట్.

ప్రకృతి పరిరక్షణ సామాజిక బాధ్యత

– : ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా సైకిల్ తొక్కిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్..

అనంతపురం, జూన్ 05 :

– సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యతగా గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ మరియు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ప్రజలకు పిలుపునిచ్చారు.

– ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా శుక్రవారం నగరంలోని అనంతపురం కలెక్టరేట్ నుంచి ఉప్పరపల్లిలోని యాక్సియన్ ఫ్రాటర్నా ఎకాలజీ సెంటర్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ మరియు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ప్రారంభించారు. ముందుగా ప్రజలకు ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేతో కలిసి జిల్లా కలెక్టర్ కొంత దూరం వరకు ఈ సైకిల్ ను తొక్కారు.

– అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొక్కలను పెంచి పచ్చదనాన్ని పంచే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగానే కాకుండా వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ యజ్ఞంలో భాగస్వాములు కావాలని, ప్రకృతి తల్లిలాంటిదని, పకృతికి ప్రాణాధారమైన చెట్లు ప్రాణికోటికి ప్రాణాధారమని పేర్కొంటూ మొక్కల యొక్క విశిష్టతను తెలియజేశారు. సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్న పరిసరాలను పచ్చదనంతో నింపాలని ఆయన ఆకాంక్షించారు. సామాజిక అడవుల పెంపకం ద్వారా గ్రామీణ ఉపాధి హామీ పథకం భాగస్వామ్యంతో ప్రజలకు ఒకవైపు ఉపాధి కల్పిస్తూనే పచ్చదనాన్ని పెంచడం జరుగుతుందన్నారు. మొక్కలను వ్యక్తిగతంగా అభిమానిస్తూ మన ఇంటి పరిసరాల్లో మనకు చేరువలో పచ్చదనాన్ని ఉంచుకోవాలని యువతను కోరారు. మనం నాటిన మొక్కలను మనమే క్రమం తప్పకుండా సంరక్షించే బాధ్యతను కూడా స్వీకరించాలని తెలిపారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూర దృష్టితో పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వ ధ్యేయంగా మలుచుకుంటూ రాష్ట్ర అభివృద్ధిని హరిత దిశలో నడిపిస్తున్నట్లు తెలిపారు. అలాగే జిల్లాలో కనీసం ఒక 50 రెసిడెన్షియల్ పాఠశాలలు వసతిగృహాలు, నెట్ జీరో కాన్సెప్ట్ లో అంటే ఎటువంటి కార్బన్ బయటికి వెళ్లినది సీక్వెస్ట్ ట్రేడ్ చేసినట్లు నెట్ జీరో కాన్సెప్ట్ లో కూడా ఒక 50 హాస్టల్స్ అండ్ రెసిడెంట్ ఇన్స్టిట్యూషన్ ని కన్వర్ట్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఈ లొకేషన్స్ లో అల్ట్రా హైడెన్సిటీ ప్లాంటేషన్స్ అంటే కనీసం ఒక 25 సెంటర్ నుంచి రెండు, మూడు సెంట్లు వరకు ప్రాంతాన్ని గుర్తించి దానిలో కూడా అల్ట్రా హైటెక్ సిటీ ప్లాంటేషన్స్ చేసుకోవడం, అలాగే సోప్ బిట్స్ లేదా రైన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ సోలార్ ఎన్.ఆర్.డి క్యాప్ హెల్ప్ తో స్టేట్ లెవెల్ లోనే టెండర్ కి వెళ్లి వెళ్ళిపోతున్నారని, సుమారుగా ఒక 50 దాకా ఆ ఇన్స్టిట్యూషన్ ని నెట్ జీరో కి చేయడం కూడా మొదలుపెడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో పచ్చదనం శాతం పెంచడమే లక్ష్యమని, ప్రతి మండలంలో ప్రతి సచివాలయాల్లో విరివిగా చెట్లు నాటే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రతి ఒక్కరూ సోషల్ ఫారెస్ట్ ద్వారా ఉచితంగా చెట్లను పొంది మొక్కలు నాటి వాటి పరిరక్షణకు కృషి చేయాలని తెలిపారు. కనీసం ఆరు నెలల నుంచి 8 నెలల వరకు దాన్ని సంరక్షిస్తే పర్యావరణ పరిరక్షణకు సహకరించినట్లు వారవుతారని తెలిపారు. జిల్లాలో గతం కన్నా మిన్నగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సోషల్ ఫారెస్ట్రీ ఎన్ఆర్ఈజీఎస్ ఆర్టికల్చర్ అగ్రికల్చర్ తదితర శాఖల సమన్వయంతో జిల్లాలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 2.5 కోట్ల విత్తనబంతులు, అలాగే మన జిల్లాలో 13 లక్షల విత్తన బంతులు, 1 కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టే దిశగా సమాయత్తమవుతున్నట్లు తెలిపారు. ప్రజలు ఆరోగ్యవంతమైన వాతావరణంలో ఉండాలని, పర్యావరణానికి పెనుముప్పుగా మారిన కాలుష్యం తదితర లాంటి వాటిపై అవగాహనను కలిగి ఉండాలన్నారు. ఈ సీజన్ లో మొక్కలు నాటడమే కాకుండా విత్తన బంతుల్ని మొత్తం వర్షానికి ముందు ముందు అంతట వెదజల్లడానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు.

పర్యావరణాన్ని కాపాడుకోవాలి : ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్

– పర్యావరణంపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణ కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కనీసం వారంలో ఒక రోజైనా ఇంధన వాహనాలను పక్కనపెట్టి ఇంధన పొదుపు పర్యావరణ కోసం కృషి చేయాలన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపుమేరకు ఇప్పటికే ఇంధన పొదుపు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి ఏటా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని, అలాంటివి తగ్గాలంటే అటవీ సంపద ఎక్కువగా పెరగాల్సి ఉందన్నారు. ముఖ్యంగా వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ తగ్గి ఆక్సిజన్ పెరగాలని, దీనిపై జిల్లాలో కోటి మొక్కలు నాటాలన్నది ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ధర్మల్ పవర్ పక్కన పెట్టి సోలార్ విండ్ పవర్ ను ప్రోత్సహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. జిల్లావ్యాప్తంగా అన్ని శాఖలను భాగస్వామ్యం చేసి పర్యావరణ పరిరక్షణకు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకున్నట్లు గుర్తు చేశారు. అటవీ శాఖ కార్యాలయంలో ప్రజలకు విస్తృతంగా అవసరమైన మేరకు మొక్కలు అందుబాటులో ఉంటాయని, ప్రజలు ఉచితంగా వెళ్లి మొక్కలను పొందవచ్చునని తెలిపారు. మొక్కలు నాటిన తర్వాత వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలని కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న ప్రతి సంవత్సరం అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు.

– అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి శివారు ప్రాంతం టివి.టవర్ వరకు కాలినడకన జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే బయలుదేరి వెళ్లారు. జిల్లా కాలుష్య నియంత్రణ మండలి విభాగం మరియు సామాజిక అటవీ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ అవగాహన ర్యాలీ ఏఎఫ్ ఎకాలజీ కేంద్రం వరకు ర్యాలీ కొనసాగింది.

– ఈ కార్యక్రమంలో సామాజిక వన విభాగం జిల్లా అధికారి గురు ప్రభాకర్, జిల్లా పర్యావరణ కాలుష్య నియంత్రణ శాఖ అధికారి శశికళ, డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ శైలజ, వ్యవసాయ శాఖ అధికారి సాలు రెడ్డి, ఆర్డిటి ఏఎఫ్ ఎకాలజీ డైరెక్టర్ మల్లారెడ్డి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ దీప, శివరాం, వివిధ శాఖల అధికారులు, పలువురు రైతులు, విద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, కిమ్స్ హాస్పిటల్ నర్సింగ్ విద్యార్థులు, జిందాల్ సంస్థ ప్రతినిధులు ఉద్యోగులు, తదితరులు పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు.

Posted Under AP
Editor