ఖచిత్వంతో కూడిన పారదర్శక ఓట‌ర్ల జాబితా లక్ష్యంగా సర్ (SIR) నిర్వహణ చేపట్టాలి

అనంతపురం జిల్లా, కలెక్టరేట్.

ఖచిత్వంతో కూడిన పారదర్శక ఓట‌ర్ల జాబితా లక్ష్యంగా సర్ (SIR) నిర్వహణ చేపట్టాలి

– ఓటరు జాబితాలో అనర్హులు లేకుండా చూడ‌టం, అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు అయ్యేలా చూడాలని, ఖచిత్వంతో కూడిన పారదర్శక ఓట‌ర్ల జాబితా లక్ష్యంగా సర్ (SIR) నిర్వహణ ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి మలోలా పేర్కొన్నారు.

– శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్ నందు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా జిల్లాలోని ఈఆర్ఓలు మరియు ఎఈఆర్ఓ, ఈడిటిలు, బిఎల్ఓలకు సర్-2026 ప్రక్రియపై అవగాహన కల్పించి శిక్షణ ఇచ్చారు.

– ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మరియు డిప్యూటీ ఎలక్షన్ అధికారి మలోలా మాట్లాడుతూ క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌త‌కు ఆరోగ్య‌క‌ర ఓట‌ర్ల జాబితా కీల‌కమ‌ని, దోష ర‌హిత ఓట‌ర్ల జాబితా ల‌క్ష్యంగా ప్ర‌త్యేక స‌మ‌గ్ర సవరణ (సర్) ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్ర‌ణాళికాయుత కృషి జ‌రుగుతోంద‌ని పేర్కొన్నారు. ఓట‌ర్ల మ్యాపింగ్ లో ప్ర‌తి విష‌యం పారదర్శకంగా విధులను నిర్వర్తించాలని తెలియ‌జేశారు. ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక స‌మ‌గ్ర స‌వ‌ర‌ణకు సంబంధించి జూన్ 5 నుంచి 14వ తేదీ వ‌ర‌కు స‌న్న‌ద్ధ‌త కార్య‌క‌లాపాలు జ‌రుగుతాయ‌ని.. ఆపై జూన్ 15 నుంచి జులై 14 వ‌ర‌కు బీఎల్‌వోల ద్వారా ఇంటింటి స‌ర్వే జ‌రుగుతుంద‌ని వివ‌రించారు. అర్హుల‌ను ఓట‌రు జాబితాలో ఉండేలా చేయ‌డంతోపాటు అన‌ర్హులు, మృతులు, శాశ్వ‌తంగా వ‌ల‌స‌వెళ్లినవారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉండ‌టం వంటి వారి ఓట్ల‌ను తొల‌గించి స్వ‌చ్ఛ‌మైన ఆరోగ్య‌క‌ర‌మైన ఓట‌ర్ల జాబితా ల‌క్ష్యంగా స‌ర్ ప్ర‌క్రియ చేపట్టాలని అన్నారు.

– బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) తప్పనిసరిగా ప్రతి ఇంటికీ వెళ్లి ఎన్యూమ‌రేష‌న్ ఫారాల‌ను పంపిణీ చేయాల్సి ఉంటుంద‌న్నారు. సర్వే సమయంలో బీఎల్‌వోలు త‌మ వద్ద తగినన్ని ఫారం-6, 7, 8 త‌దిత‌రాల‌ను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం గరిష్టంగా 1200 మంది ఓటర్లకు మాత్రమే పరిమితం కావాలని.. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై నిబంధనల ప్రకారం హేతుబ‌ద్ధీక‌ర‌ణ జ‌ర‌గాల‌న్నారు. ఈ స‌మ‌గ్ర సవరణ ప్రక్రియను గడువులోగా, ఎలాంటి తప్పుల‌కు ఆస్కారం లేకుండా పూర్తి చేయాలని బిఎల్ఓ లకు సూచించారు. ఎన్ని మోరేషన్ పబ్లికేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ ఎలెక్ట్రోల్ క్లీన్ అండ్ అబ్జెక్షన్స్ డిస్పోజల్ ఫైలింగ్, నోటీసు పంపడం వాటి డిస్పోజలు మరియు ఫైనల్ వాటర్ జాబితా ప్రచురణ ఈ ప్రక్రియ అన్ని గడువులోపు పూర్తి చేయాలని సూచించారు. 2002 -05 ఓటర్ల జాబితాను మరియు 2025 ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచుకొని మ్యాపింగ్ ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుందన్నారు.

– ఈ కార్యక్రమంలో కో ఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ యగేశ్వరి దేవి, ఎన్నికల సెక్షన్ డిటి కనకరాజు, తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor