పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: జడ్పీ సీఈవో విజయలక్ష్మి
పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అనంతపురం జిల్లా పరిషత్ సీఈఓ విజయలక్ష్మి పేర్కొన్నారు ఉరవకొండ పట్టణంలోని పలు ప్రాంతాల్లో సెరెంటికా కంపెనీ నేతృత్వంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.. ఉరవకొండ పరిసర ప్రాంతాల్లో దాదాపు 1000 మొక్కలను నాటే విధంగా సెరెంటీకా కంపెనీ కార్యక్రమం రూపొందించింది. అందులో భాగంగా ఉరవకొండలో ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పీ సీఈఓ విజయలక్ష్మి హాజరయ్యారు. ఉరవకొండలోని ప్రధాన రహదారిపై మొక్కలు నాటిన సీఈవో అనంతరం మీడియాతో మాట్లాడుతూ కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాలో మొక్కల పెంపకం అనేది అత్యంత కీలకమన్నారు. పర్యావరణం రక్షణతో పాటు సకాలంలో వర్షాలు కురియాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు పెంచడం బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఉరవకొండ పరిసర ప్రాంతాల్లో సెరెంటికా కంపెనీ దాదాపు 1000 మొక్కలు నాటేందుకు ముందుకు రావడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.అనంతరం సరెంటికా కంపెనీ ప్రతినిధులు ఉరవకొండ పోలీస్ స్టేషన్, ఎంపీడీవో కార్యాలయం పరిసర ప్రాంతాల్లో కూడా వివిధ రకాల మొక్కలను నాటారు.ఈ సందర్భంగా ఉరవకొండ ఎస్సై జనార్ధన్ నాయుడు మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెరెంటికా కంపెనీ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. పర్యావరణం పరిరక్షణలో పోలీసులు కూడా తమ వంతు పాత్ర పోషిస్తామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సెరెంటికా కంపెనీ ఏపీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ తోపాటు సి ఓ ఓ బిగియాన్ పిఎమ్ఓ హేమానంద్, పీఈ హెడ్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు…
