Latest Posts

పెన్నహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో దేవాదాయ శాఖ కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన: అభివృద్ధి పనులపై సమీక్ష

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానము, పెన్నహోబిలము గౌరవ నీయులైన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారి సూచనల మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ గౌరవనీయులు శ్రీయుత కమిషనరు గారు, విజయవాడ వారు ఫీల్డ్ విజిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానము కార్యనిర్వహణాధికారి గారు , ఆలయ చైర్మన్ రేగటి నాగరాజు గారు, ధర్మ కర్తల మండలి సభ్యులు, అర్చకులు మేళ తాళాలతో పూర్ణ కుంభ స్వాగతం పలికి శ్రీ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ యుత కమిషనరు గారు, దేవాదాయ శాఖ ఇంజనీరు లు, శ్రీ రామాంజనేయులు గారు డిప్యూటీ కమిషనర్, కర్నూలు, జిల్లా దేవాదాయ శాఖ అధికారి జి.మల్లికార్జున ప్రసాద్ గారు, ఆలయ ఈవో, ఛైర్మెన్, ధర్మ కర్తల మండలి సభ్యులుతో ఆలయ పరిసరాలు, అభివృద్ధి పనులు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి దేవాదాయ శాఖ ఇంజనీర్లకు అవసరమైన సూచనలు చేశారు. ఆలయ నాలుగు రాజగోపురం నిర్మాణము, ప్రాకారము, సాలహారం, భక్తుల సౌకర్యార్థం నీటి సౌకర్యం కొరకు ఓవర్ హెడ్ ట్యాంకు ఏర్పాటు, వసతి సౌకర్యం కొరకు వసతి గదులు నిర్మాణము, టాయిలెట్ బ్లాక్స్ నిర్మాణము ఆలయ నిర్వహణ, పారిశుద్ధ్యం మరియు భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామాంజనేయులు , డిప్యూటీ కమిషనర్, కర్నూలు , జిల్లా దేవాదాయ శాఖ అధికారి శ్రీ జి.మల్లికార్జున గారు, దేవాదాయ శాఖ ఇంజనీరు, ఆలయ చైర్మన్ రేగటి నాగరాజు గారు, ఆలయ ఈవో సాకే రమేష్ బాబు,ధర్మ కర్తల మండలి సభ్యులు, అర్చకులు, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Posted Under AP
Editor