ముదిగుబ్బ తాసిల్దార్‌కు వినతిపత్రం సమర్పించిన ఎస్సీ, ఎస్టీ జేఏసీ

ముదిగుబ్బ యస్ 9
ముదిగుబ్బ మండలంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ భూముల సమస్యలపై ముదిగుబ్బ తాసిల్దార్ గారికి ఎస్సీ ఎస్టీ జేఏసీ అధ్యక్షుడు సాకే హరి గారి ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది… అలాగే ముదిగుబ్బ మండల కేంద్రంలో దళితులకు స్మశాన వాటికను కేటాయించాలని అలాగే గత ప్రభుత్వ హయాంలో అంబేద్కర్ భవనమును గ్రామ సచివాలయమునకు ఉపయోగించుకుంటున్నారు… 2020 నుంచి ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో అనేకసార్లు అర్జీ రూపంలో తెలియజేసిన అధికారులు పట్టించుకోని సచివాలయాన్ని ఖాళీ చేయించలేదు కావున ఇప్పటికైనా సచివాలయాన్ని ఖాళీ చేయించి దళితుల సమావేశాలు జరుపుకొనుటకు అంబేద్కర్ భవనమును దళితులకు అప్పగించాలని డిమాండ్ చేయడం జరిగింది.. అలాగే పలకవేముల ఖాదరవల్లి భూమికి రాస్తా కోసం అర్జీఇవ్వడం జరిగింది..అలాగే చర్మాలఫక్రుద్దీన్ భూమికి దారి చూపమని తాసిల్దార్గారిని కోరడం జరిగింది సరితాల పకీరప్ప గారికి భూమికి పాసుపుస్తకం మంజూరు చేయమని తాసిల్దార్ గారిని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ జేఏసీ అధ్యక్షులు,సాకే హరి సాకే రంగనాయకులు,సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఆటో పెద్దన్న సిఐటియు మండల కార్యదర్శి బాబ్జాన్ పకీరప్ప ఖాదరవలి ఫక్రుద్దీన్ ముజాఫర్ రామంజి ఉప్పలపాడు నారాయణస్వామి పాల్గొనడం జరిగింది…

Posted Under AP
Editor