ముదిగుబ్బ యస్ 9
ముదిగుబ్బ మండలంలో సత్యసాయి నీటి సరఫరా కార్మికులకు జీతాలు చెల్లించాలని ముదిగుబ్బ పట్టణ ప్రజలు, సత్యసాయి కార్మికులతో కలిసి రెండవ రోజు బుధవారం నాడు కూడా ఆందోళన కార్యక్రమం నిర్వహించారు…ఈ మేరకు సత్యసాయి కార్మికులు,మహిళలు ఖాళీ బిందెలు చేతపట్టి సిపిఐ నాయకులు చల్లా శ్రీనివాసులు, వైయస్సార్ పార్టీ నాయకులు మల్లా గుండ్ల భాస్కర్, చిన్న బాలముని ల ఆధ్వర్యంలో ముదిగుబ్బలో నాలుగు రోడ్ల కూడలిలో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు… అనంతరం వారు తాగునీటి సమస్యను పరిష్కరించాలని, కార్మికులకు జీతాలు చెల్లించాలని నినాదాలు చేస్తూ ఎంపీడీవో, రెవెన్యూ కార్యాలయాల వరకు ర్యాలీగా వెళ్లి అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ Rws JE ప్రసాద్ కు వినతిపత్రం ఇచ్చారు…తదనంతరం మహిళలు, నీటి సరఫరా కార్మికులు, వైసిపి, సిపిఐ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దార్ మహేశ్వర్ రెడ్డికి అందజేశారు, ఈ కార్యక్రమం లో టిడిపి నాయకులు శంకర్ నాయుడు,తుమ్మల మదు, అమిలినేని రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు…
ముదిగుబ్బ లో రెండవ రోజు కూడ నీటి సమస్య పై రాస్తారోకో…
