Latest Posts

అనంతపురం జిల్లాలో 17 మంది ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళు అరెస్ట్…

అనంతపురం జిల్లా, రాయదుర్గం.

అనంతపురం జిల్లాలో 17 మంది ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళు అరెస్ట్
రూ. 1.34 లక్షలు నగదు, 17 చరవణులు స్వాధీనం

అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గా హోన్నూరు గ్రామంలోని దర్గా సమీపంలో కొంతమంది యువకులు ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ ఉండగా మంగళవారం పోలీసులు దాడుల నిర్వహించి 17మంది బెట్టింగ్ రాయిళ్లను అరెస్ట్ చేసి రూ. 1.34 లక్షలు నగదు, 17 చరవాణులను స్వాధీనం చేసుకున్నట్లు రాయదుర్గం గ్రామీణ సీఐ వెంకటరమణ, ఎస్ఐ నబి రసూల్ తెలిపారు.
దర్గా ప్రాంతంలో యువకులు క్రికెట్ బెట్టింగ్లో భాగంగా సిక్స్, ఫో్ర్, ఔట్, గెలుపు ఓటమిలపై బెట్టింగ్ ఆడుతూ పట్టుబడినట్లు వారు తెలిపారు.
మండలంలోని ఉద్దేహాల్, గోవిందవాడ గ్రామాల్లో కూడా కొంత మంది బెట్టింగ్ ఆడుతున్న వారిని అదుపులోనికి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. గ్రామాల్లో యువకులు ఆన్లైన్ గేమ్, క్రికెట్ బెట్టింగ్, జూదం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ప్రస్తుతం ఎంతోమంది యువత క్రికెట్ బెట్టింగ్, జూదం వంటి వ్యసనాలకు గురై అప్పుల్లో కోరుకొని పోయారన్నారు నిందితులపై కేసు నమోదు చేసి రాయదుర్గం కోర్టులో హాజరు పరుస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు

Posted Under AP
Editor