ముదిగుబ్బ, యస్ 9…
ముదిగుబ్బ మండలం సానే వారి పల్లి గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు… ఈ శిబిరాన్ని ముదిగుబ్బ మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు తుమ్మల మనోహర్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.శిబిరంలో వైద్యులు గ్రామ ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు.ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షుడు గుత్తా కార్తీక్ నాయుడు, సానే వారి పల్లి తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు గుర్రంకొండ బాబ్జాన్, నబి రసూల్, మహమ్మద్ అలీ, బాబ్జాన్ తదితరులు పాల్గొన్నారు…
సానే వారి పల్లిలో ఉచిత వైద్య శిబిరం….
