ప్లాస్టిక్ వద్దు.. పేపర్ బ్యాగ్ లు ముద్దు: కదిరిలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ!

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి

ప్లాస్టిక్ వద్దు పేపర్ బ్యాగ్ లు ముద్దు ప్లాస్టిక్ ను నివారిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

సత్య సాయి జిల్లా కదిరి
పట్టణంలోని ప్లాస్టిక్ వద్దు పేపర్ బ్యాగ్ లు ముద్దు అంటూ ప్లాస్టిక్ నివారిద్దం పర్యావరణం కాపాడుదాం అని మెప్మ సిబ్బంది,మరియు నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు.

పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరు పాటుపడాలని, ప్లాస్టిక్ కవర్, వస్తువుల వాడకాన్ని ప్రతి ఒక్కరు నిషేధించాలని తెలిపారు.

పేపర్ సంచులు వాడి పర్యావరణాన్ని కాపాడాలని స్థానిక వ్యాపారులకు, ప్రజలకు అవగాహన కల్పించిన శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor