Latest Posts

అనంతపురం జిల్లాలో విషాదం…..

అనంతపురం జిల్లా, రాయదుర్గం.

*అనంతపురం జిల్లాలో విషాదం*

*గాలి వాన బీభత్సం గోడ కూలి ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు*

అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం మైలాపురం గ్రామంలో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులకు గోడ కూలిన ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

మృతుడిని గ్రామానికి చెందిన వెంకటేశులు (55)గా గుర్తించారు. గోడ కూలిన సమయంలో వెంకటేశులుతో పాటు మరో ఇద్దరు శిథిలాల కింద చిక్కుకున్నారు. గమనించిన గ్రామస్తులు హుటాహుటిన సహాయ చర్యలు చేపట్టి శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరినీ బయటకు తీశారు. తీవ్ర గాయాలపాలైన వారిని మెరుగైన వైద్యం కోసం బళ్ళారి విమ్స్ ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో 10 గొర్రెలు కూడా మృత్యువాత పడ్డాయి. గ్రామంలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, తీగలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Posted Under AP
Editor