అనంతపురం జిల్లా, రూరల్.
– *నిర్మిత సమయంలోపు అభివృద్ధి పనులను పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం అనంతపురం రూరల్ మండలంలోని కందుకూరు గ్రామంలో ఉన్న అహుడాకు సంబంధించిన ఎంఐజి లేఅవుట్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అహుడాకు సంబంధించిన ఎంఐజి లేఅవుట్ లో అభివృద్ధి పనులను వేగవంతంగా చేపట్టాలని, కాంట్రాక్టర్లు నిర్ణీత సమయంలో పనులను పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అహుడా ఈఈ దుష్యంత్, ఇంచార్జి తహసీల్దార్ అరుణ, ఆర్ఐ సందీప్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.*
