నల్లమాడలో నీటి కష్టాలు: రెడ్డిపల్లి బీసీ కాలనీలో చుక్క నీరు లేక ప్రజల హాహాకారాలు.. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం మండల పరిధిలోని రెడ్డిపల్లి బీసీ కాలనీలో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. గత రెండు నెలలుగా కాలనీలో నీళ్లు లేక కాలనీవాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సమస్యను అధికారులను దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకెళ్లిన స్పందించడం లేదని కాలనీవాసులు వాపోయారు. నీళ్లు లేక అర కిలోమీటర్ దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నామన్నారు. ముఖ్యంగా వృద్ధులు అంత దూరం నుంచి నీళ్లు తెచ్చుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి కాలనీకి నీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు

Posted Under AP
Editor