అనంతపురం జిల్లా, టౌన్.
*నగరంలో పారిశుద్ధ్యంను మరింత మెరుగుపరచాలి*
– *: 20 రోజుల్లో మార్పు రావాలి*
– *: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్*
– *నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్యంను మరింత మెరుగుపరిచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నగరంలో శానిటేషన్ నిర్వహణపై నగరపాలక సంస్థ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.*
– *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలోని అన్ని డివిజన్ల పరిధిలో శానిటేషన్ కు సంబంధించి డోర్ టు డోర్ మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. చెత్తను తీసుకుని వెళ్లే వాహనాలకు సంబంధించి రియల్ టైం మానిటరింగ్ కోసం కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలన్నారు. నగరంలో పారిశుద్ధ్యం మెరుగుకు సంబంధించి 20 రోజుల్లో ఖచ్చితంగా మార్పు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయం వారిగా డస్ట్ బిన్ లను ఎప్పుడు తొలగిస్తారు, ఏ సమయంలో తొలగిస్తారు అనేది ప్రణాళిక ఉండాలన్నారు. చెత్త తరలింపులో ప్రణాళిక సరిగా ఉండాలని, పారిశుధ్యం మెరుగుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంత్ రావు, ఇన్చార్జి ఎంహెచ్వో సునీత, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.*
