అనంతపురంలో పల్లా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు: పూల నాగరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

అనంతపురం జిల్లా, టౌన్.

*ఏపీ టిడిపి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షులు, ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ చైర్మన్ నాగరాజు గారు*

*అనంతపురం నగరం, రాంనగర్ లో గల కమ్మ భవన్ వద్ద గల శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం నందు పల్లా శ్రీనివాసరావు గారికి ఆయురారోగ్యాలుతో సంతోషంగా ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం అక్కడే పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం కమ్మ భవన్ వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.*

*ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు పూల నాగరాజు గారితో పాటు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి, పార్టీ సీనియర్ నాయకులు గడ్డం సుబ్రమణ్యం, సరిపూటి సూర్యనారాయణ, బాంబే నాగన్న, సివి కొండయ్య, మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ గౌస్ మొద్దీన్, క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఈటె స్వామిదాసు, తదితరులు పాల్గొన్నారు*

Posted Under AP
Editor