శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి హనుమజ్జయంతి మహోత్సవాలు – 2026

శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కసాపురం గ్రామము, గుంతకల్లు మండలం , అనంతపురం జిల్లా.

శ్రీ హనుమజ్జయంతి మహోత్సవములు – 2026.

12.05.2026 మంగళవారము వైశాఖ బహుళ దశమి హనుమజ్జయంతి సందర్భంగా ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి పాత్ర కాల ఆరాధన , 9 గంటల నుండి దేవాలయం ముందు భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద లక్ష పుష్పార్చన తదుపరి పూర్ణాహుతి , హారతి , తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం మరియు సాయంత్రం 5 – 30 నిమిషాల నుండి శ్రీ స్వామి వారికి ఒంటె వాహనంపై ప్రాకారోత్సవం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీ మేడేపల్లి విజయ రాజు గారు , అనువంశిక ధర్మకర్త శ్రీమతి కే సుగుణమ్మ గారు , ప్రధాన అర్చకులు శ్రీ కె రాఘవాచార్యులు , వేద పండితులు , అర్చకులు , అధికారులు , సిబ్బంది, భక్తులు, గ్రామ ప్రజలు , పాల్గొన్నారు.

Posted Under AP
Editor