Latest Posts

బీజేపీ కడప జిల్లా అధ్యక్షుడిపై పోలీసుల దాడి దుర్మార్గం: కిసాన్ మోర్చా నేత సోమల ప్రకాష్ నాయుడు ధ్వజం

పత్రికా ప్రకటన
భారతీయ జనతా పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి పై పోలీసులు దాడి దుర్మార్గం భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా సత్యసాయి జిల్లా అధ్యక్షుడు సోమల ప్రకాష్ నాయుడు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
ఈ రోజు కడప జిల్లా కడప లో హనుమాన్ జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహించాలని ఈ సందర్భంగా పట్టణం లో పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లను ధ్వంసం చేసి ఎందుకు తొలగించినారని ప్రశ్నించి న హిందూ సంఘాల పై అదేవిధంగా కడప జిల్లా బీజేపీ అధ్యక్షుడిపై దాడి చేయటం. అరాచక శక్తుల జోలికి పోకుండా ప్రజాస్వామ్య యుతంగా నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు ఈ విధంగా దాడులకు దిగుతారా .ఈ విషయాన్ని ప్రశ్నించిన కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు సుబ్బారెడ్డి పై పోలీసుల చేయి చేసుకోవటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము హిందూ సనాతన ధర్మం
పండుగలను జరుపుకునే స్వేచ్ఛ కూడా లేదా అని ప్రశ్నిస్తున్నాము.దీనిపై సమగ్ర విచారణ జరిపి బీజేపీ జిల్లా అధ్యక్షుడిపై చేయి చేసుకున్న పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మార్చా సత్యసాయి జిల్లా అధ్యక్షుడు సోమల ప్రకాష్ నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

Posted Under AP
Editor