అనంతపురం జిల్లా,గుత్తి.
- పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో 100 శాతం విద్యార్థులు పాస్ అయ్యేలా చూడాలి: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్
- గుత్తి కోటలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న రెమిడియల్ తరగతులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..
– *పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో 100 శాతం విద్యార్థులు పాస్ అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గుత్తి మండల కేంద్రంలోని గుత్తి కోటలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం బడి పిలుస్తోంది అవగాహన కార్యక్రమం మరియు సప్లమెంటరీ 10వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న రెమిడియల్ తరగతులను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈనెల 4వ తేదీ నుంచి 24వ తేదీ వరకు సప్లమెంటరీ 10వ తరగతి విద్యార్థులకు రెమిడియల్ తరగతులను నిర్వహించడం జరుగుతోంది.*
– *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలలో గుత్తి కోటలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న 84 మంది విద్యార్థులకుగాను 60 మంది విద్యార్థులు పాస్ కాగా, 24 మంది ఫెయిల్ కావడం జరిగిందని, అందులో ఒకరు ఒక సబ్జెక్టులో, 23 మంది పలు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారని, ఎందువల్ల ఫెయిల్ అయ్యారని వివరాలు ఆరా తీశారు. వచ్చే సప్లమెంటరీ పరీక్షల్లో అన్ని పాఠశాలల నుంచి 100 శాతం పాస్ అయ్యేటట్లు చూసుకోవాలని ఆదేశించారు. రెమిడియల్ తరగతులకు ఫెయిల్ అయిన విద్యార్థులు పూర్తిగా హాజరయ్యేలా చూడాలని, 24 మందిలో ఎంతమంది విద్యార్థులు వచ్చారని అడగగా, ఎనిమిది మంది రావడం జరిగిందని అధికారులు తెలపగా, అందరు రెమిడియల్ తరగతులకు హాజరుకావాలని, ప్రతిరోజు అటెండెన్స్ తీసుకోవాలన్నారు. మల్టిపుల్ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన వారికి టైం టేబుల్ పెట్టి చదివించాలని, అందరూ కూడా సప్లమెంటరీ పరీక్షల్లో పాస్ అయ్యేలా దృష్టి పెట్టాలన్నారు. పాఠశాలల్లో ఒక్కరు కూడా పాస్ కాని వారు ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని యాజమాన్యాలకు తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ బాగా చదువుకొని సప్లమెంటరీ పరీక్షల్లో ప్రతి ఒక్కరూ పాస్ కావాలని సూచించారు.*
– *ఈ కార్యక్రమంలో డివైఈఓ లక్ష్మన్న, మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా, తహసిల్దార్ పుణ్యవతి, ఎంఈఓ రవి నాయక్, ఎంఈఓ2 మనోహర్, పాఠశాల హెడ్మాస్టర్ సుభాన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.*
