స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రాముఖ్యతను గురించి విద్యార్థులు ఉపాధ్యాయులు తెలుగుదేశం నాయకులు ర్యాలీ…

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం లో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రాముఖ్యతను గురించి విద్యార్థులు ఉపాధ్యాయులు తెలుగుదేశం నాయకులు ర్యాలీ.

నల్లమాడ మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమం ముఖ్యంగా ప్లాస్టిక్ రహిత పాలన మరియు మార్కెట్లు అనే ప్రత్యేక అంశంతో నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వలన వాతావరణం నీరు భూమి మొత్తం కాలుష్యం కావడం జరుగుతున్నది, దీనివలన మానవాళికి అతి పెద్ద ప్రమాదం పొంచి ఉంది మనం నిత్యం వాడే ప్లాస్టిక్ కవర్లకు బదులు కాటన్ మరియు జ్యూట్ తో తయారు చేసినటువంటి సంచులు వాడడం అలవాటు చేసుకోవాలని కోరారు హెడ్మాస్టర్ మాట్లాడుతూ పర్యావరణా న్ని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత అని వాటిని పరిరక్షించుకోవడం అత్యంత ఆవశ్యకమని వారు తెలిపారు.
మనం వాడే ప్లాస్టిక్ కవర్లు భూమిలో కలిసి పోవడానికి వందల సంవత్సరాలు పడుతుంది. మనం రోజు వాడే ప్లాస్టిక్ వస్తువులు భూమిలో కలిసిపోవడానికి దాదాపుగా 50 సంవత్సరాలు పడుతుంది. ప్లాస్టిక్ వస్తువును తగ్గించి వాటి స్థానంలో గాజు స్టీల్ రాగి మొదలగు వాడితో తయారైన వస్తువులను వాడినప్పుడే మనం పర్యావరణాన్ని కాపాడుకోగలము, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించలి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, చెట్టు నరకడాన్ని అరికట్టాలని, అడవులు రక్షించుకొనుట మన అందరి బాధ్యత అని వారు తెలిపారు.
ఈ కార్యక్రమం లో పారిశుద్ధ కార్మికులు ఉపాధ్యాయులు,విద్యార్థులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor