అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతం చేయాలి….

అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతం చేయాలి….

ఇంచార్జ్ ఆర్ డి ఓ. రామ్మోహన్
అనంతపురం, జూన్ 20:
ప్రతి ఏడాది వలె జూన్ 21న జరిగే యోగా దినోత్సవం సందర్భంగారేపటి ఉదయం జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయ
వంతంచేయాలనిఅనంతపురం డివిజన్ ఇన్చార్జ్ ఆర్ డి ఓ రామ్మోహన్ పిలుపునిచ్చారు.
శనివారం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామకృష్ణారెడ్డి తో కలిసి పోలీస్ పెరేడ్ మైదానంలో జరగనున్న ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే వివిధ అధికారులకు పనుల నిర్వహణపై దశ దిశ నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ రేపటి రోజున ఆదివారం ఉదయం 6.30 గంటల నుంచి 7.45 గంటల వరకు జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ మైదానంతో పాటు జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఆయా యోగా వేదికలలో ఒకేసారి యోగా కార్యక్రమాలు జరగను న్నాయని తెలిపారు.
అలాగే అనంతపురం డివిజన్ స్థాయిలో గుర్తించిన ప్రతి సచి వాలయపరిధిలో గుర్తించిన
వేదికల వద్ద శిక్షకుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించి పాల్గొన్న వారి వివరాలు మరియుఫోటోలను యోగాంధ్ర పోర్టల్ లో తప్ప నిసరిగా అప్లోడ్ చేయాలని సూచించారు. ముఖ్యంగా రేపటి ఉదయం పోలీసు పెరేడ్ మైదానంలో జిల్లా స్థాయి అధికారులు, శాఖధిపతులు(హెచ్ ఓ డి లు)
తమ సిబ్బంది మరియు
విద్యార్థులు ఉపాధ్యాయులు, క్రీడాకారులు, యోగా ప్రద ర్శకులు, స్వచ్ఛంద సంస్థలు ఈ యోగా కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు. మండల స్థాయి సిబ్బంది తమ తమ మండల కేంద్రంలోనిర్వహించేకార్యక్రమాలకుహాజరు కావాలని సూచించారు. అలాగే వివిధ శాఖ అధికారులతో సమీక్షిస్తూ
మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో మైదానంలో కేటాయించిన పనులు పూర్తి చేయాలని సూచించారు. యోగా వేదిక పారిశుద్ధ్యం, తాగునీటి వసతి, మైక్ సిస్టం, వైద్యారోగ్య శాఖ తరఫున శిబిరం ఏర్పాటు, విద్యుత్ సరఫరా, యోగాసనాలు చేసే వారికి అవసరమైన మేరకు మ్యాట్ల ఏర్పాట్లు తదితర పనులను సంబంధిత శాఖ అధికారులకు కేటాయించిన విధంగా సమన్వయంతో ఈరోజు సాయంత్రం లోగా పూర్తి చేసి అంతర్జాతీయ యోగా దినోత్సవం జయప్రదం చేయాలనిసూచించారు.
అనంతరం వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయంగా యోగ ప్రదర్శన కోసం పోలీస్ లైన్ లోని కమ్యూనిటీ హాల్ లో పలు శాఖ అధికారులతో కలిసి ఆర్డిఓ పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మరియు అహుడ సెక్రెటరీ రామకృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ జస్వంత్, ఐ అండ్ పి ఆర్ డిఐపిఆర్ఓ బాలకొండయ్య, ఆయుష్ డా. లాల్యా నాయక్, ఆర్ ఐ ఓ వెంకటరమణ నాయక్, మున్సిపల్ ఈఈ షాకీర్, తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor