ముదిగుబ్బలో శ్రీ సాయి బాలాజీ దంత వైద్యశాలలో తనిఖీలు
డాక్టర్ గైర్హాజరు – నోటీస్ జారీ
ముదిగుబ్బ యస్ 9, మే 4:
ముదిగుబ్బ పట్టణంలోని శ్రీ సాయి బాలాజీ దంత వైద్యశాలలో అధికారుల బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎమ్మార్వో మహేశ్వరరెడ్డి, ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ శ్వేతా మేడం, పోలీస్ అధికారులు మరియు ఇతర సిబ్బంది కలిసి ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
తనిఖీల సమయంలో సంబంధిత అర్హత కలిగిన డాక్టర్ క్లినిక్‌లో గైర్హాజరుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అవసరమైన ధృవపత్రాలు, రిజిస్ట్రేషన్ వివరాలు పరిశీలించిన అనంతరం, నియమ నిబంధనలు పాటించని నేపథ్యంలో క్లినిక్‌కు నోటీస్ బోర్డు అంటించారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వైద్య సేవలు అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ వ్యవహారంపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వారు తెలిపారు.
ముదిగుబ్బలో శ్రీ సాయి బాలాజీ దంత వైద్యశాలలో తనిఖీలు..
