- ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు చేపడతాం.
- రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్.
- కౌకుంట్లలో ప్రజా సమస్యల పరిష్కార. వేదిక.
అనంతపురం, మే 04 :
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని కౌకుంట్ల గ్రామంలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ రకాల సమస్యలపై అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేసిందన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారుసమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమకూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. తమ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. ఇందులో వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు.
