విలేకర్ వార్త రాస్తే కాళ్ళు పట్టించుకుంటారా, బెదిరిస్తారా?
అనంతపురం శ్రీ గీతం కళాశాల నిర్వాహకురాలు మనీషా నాయర్ ఓవరాక్షన్ తీరు అహంకారానికి నిదర్శనం.
– ఆమె తీరు పై తీవ్రంగా ఖండించిన గిరిజన విద్యార్థి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉప అధ్యక్షుడు సాకే పురుషోత్తం
-విలేకరి కుటుంబ సభ్యులపై దాడులు చేయడం, తన కాళ్ళను పట్టించుకోవడం దుర్మార్గపు చర్య
-విద్యావంతురాలిగా ప్రిన్సిపాల్ హోదాలో వుండి ఇలా వ్యవహరించడం సిగ్గుచేటు
– ప్రెస్ క్లబ్ వద్ద నిరసన తెలుపుతున్న జర్నలిస్టు, ప్రజా సంఘాల నాయకులపై బెదిరింపులతో ఆమె దురుసు ప్రవర్తన
– విలేకరి లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులకు ప్రాణ హాని జరుగకుండా పోలీసు వారు రక్షణ కల్పించాలి
– జిల్లా ఎస్పీ గారు స్పందించించి ఆమె పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని గిరిజన విద్యార్థి సంక్షేమ సంఘం డిమాండ్.
ఈరోజు మనం దిన పత్రికా విలేకరి లక్ష్మీనారాయణ పై శ్రీ గీతం కళాశాల నిర్వాహకురాలు మనీషా నాయర్ వ్యవహరించిన తీరు పై గిరిజన విద్యార్థి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాకే పురుషోత్తం తీవ్రంగా ఖండించారు. విలేకరుల పై, జర్నలిస్టులపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి, భావ ప్రకటనా స్వేచ్ఛకు హానికరమని ఆయన అభివర్ణించారు. ఈ మధ్య జర్నలిస్టులపై, విలేకరులపై బెదిరింపు చర్యలు, దాడులు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక దళిత సోదరుడైన మనం దినపత్రిక విలేకరి లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యుల మధ్య చిన్న పిల్లలను ఉన్న గమనించకుండా వేలు చూపి బెదిరిస్తూ అహంకారంతో తన కాళ్ళను పట్టించుకుంటున్న గీతం కళాశాల నిర్వాహకురాలు మనీషా నాయర్ వ్యవహరించిన తీరు దారుణం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యం చూస్తే ఆమె వ్యవహరించిన తీరు ఏపాటిదో అర్థం అవుతుంది. ఇలా వ్యవహరించిన వారి పై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, ఆమె పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గిరిజన విద్యార్థి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాకే పురుషోత్తం డిమాండ్ చేశారు. సమాజంలో విలేకరులపై, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఎప్పటికప్పుడు ఖండిస్తూ గిరిజన విద్యార్థి సంక్షేమం సంగం ద్వారా వారికి అండగా నిలుస్తామని ఆయన తెలిపారు.
