ధర్మవరం అభివృద్ధికి యువత మద్దతు: బీజేపీ రాష్ట్ర కార్యదర్శిని కలిసిన కిషోర్ స్వామి

తాడిమర్రి( yes9tv)ధర్మవరం అభివృద్ధికి యువశక్తి కట్టుబాటు – బీజేపీ నేతలను కలిసిన కిషోర్ స్వామి
ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత సత్యకుమార్ అన్న గారి సారథ్యంలో, “భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి నేను సైతం” అనే సంకల్పంతో మరువపల్లి గ్రామానికి చెందిన యువనాయకుడు శ్రీ కిషోర్ స్వామి ముందుకు వచ్చారు.
ఈ సందర్భంగా అనంతపురంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ సందిరెడ్డి శ్రీనివాసులు అన్న గారి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి షాలువ, పూల బొకే అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఆర్వేటి ఆనంద్, ధర్మవరం మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొంకా నాగార్జున, తాడిమర్రి సింగిల్ విండో డైరెక్టర్ అనుగుత్తి రమణ, మండల కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి నిడిగళ్ళు రామాంజి, అగ్రహారం స్కూల్ చైర్మన్ నీరుగట్టు నాగార్జున, అగ్రహారం చెరువు ఆయకట్టు చైర్మన్ బాటన్న గారి లక్షన్న తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor