విశాఖ
- విశాఖ కేజీహెచ్ లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
- ఓపీ పుస్తకాల లోపాలపై కలెక్టర్ ఆగ్రహం
- పలు విభాగాల పనితీరుపై నిశిత పరిశీలన
- ఆరోగ్యశ్రీ నిధులు, మందుల లభ్యతపై ఆరా
- మెరుగైన వైద్య సేవలకు స్పష్టమైన ఆదేశాలు
విశాఖ కేజీహెచ్‌లో జిల్లా కలెక్టర్ అభిషిక్తి కిషోర్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ ఆసుపత్రి పనితీరుపై నిశితంగా సమీక్షించారు. మొదట ఓపీ విభాగాన్ని పరిశీ లించిన కలెక్టర్…రోగులకు అందిస్తున్న ఓపీ పు స్తకాలపై ఆసుపత్రి పేరు, లోగో లేకపోవడాన్ని గుర్తించి ..ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మా ర్పులు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఆ తర్వాత గైనిక్, న్యూ రో, సూపర్ స్పెషాలిటీ తో పాటు సిఎస్ఆర్ బ్లాక్, మెడికల్ , రేడియేష న్ ఆంకాలజీ విభాగాలను తనిఖీ చేస్తూ… సేవ ల నాణ్యతపై కలెక్టర్ ఆరా తీశారు. ఆరోగ్యశ్రీ నిధుల వినియోగం, మందుల లభ్యత పై వివరా లు తెలుసుకుంటూ… ఎక్కడా లోపాలు ఉండ కూడదని అధికారులకు హెచ్చరించారు. రోగుల కు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవ లు అందే లా తక్షణ చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. మూడు గంటలపాటు ఆసుపత్రి అంతటా విస్తృ తంగా తనిఖీ లు నిర్వహించిన కలెక్టర్… లోపా లపై రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలని కలె క్టర్ వైద్యాధికారులకు స్పష్టమైన సందేశం ఇచ్చా రు.
