Latest Posts

బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ భరోసా.

అనంతపురం జిల్లా, రాయదుర్గం.

 

ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా పేదలకు వైద్య ఖర్చుల కోసం తరచూ ఆర్థిక సహాయం అందిస్తుండటం ఆనందకరమని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.

రాయదుర్గంలోని తన నివాసంలో శనివారం ఆయన బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అత్యవసర వైద్య చికిత్స పొందిన పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద మనసుతో ఆర్థిక సాయం అందిస్తున్నారని తెలిపారు. వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న మధ్య తరగతి కుటుంబాలకు ప్రభుత్వం చేదోడు వాదోడుగా నిలుస్తోందన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారానే ముఖ్యమంత్రి బడుగు, బలహీన వర్గాల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. గత 22 నెలల కాలంలో రాయదుర్గం నియోజకవర్గంలో 363 మందికి రూ.2.43 కోట్ల ఆర్థిక సహాయం అందించామని వెల్లడించారు. ఈ రోజు 28 మంది లబ్ధిదారులకు రూ.11.62 లక్షల చెక్కులను అందజేసినట్లు తెలిపారు. ఇంతటి సహాయం చేస్తున్న ముఖ్యమంత్రికి పేదల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ చేతులెత్తి నమస్కరిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కాదలూరు మోహన్ రెడ్డి, వన్నారెడ్డి, కురుబ హనుమంతు, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ నాగల్లీ రాజు, హనకనహాల్ నాగార్జున, sk మల్లికార్జున, రైస్ మిల్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor