Latest Posts

ప్రతిభావంతులకు అభినందించిన జిల్లా విద్యాశాఖ అధికారి..

మార్చి 2026 లో జరిగిన పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో నల్లమాడ మండలంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా విద్యాశాఖ అధికారి అయిన జి కృష్ణప్ప గారు నల్లమాడ మండలం ఎంఆర్సి నందు అభినందించారు నల్లమాడ మండలంలో మొదటి స్థానంలో నిలిచిన P.సాయి కిరణ్ నాయక్ 600/580 మార్కులు సాధించాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నల్లమాడ మరియు ఎస్ రెహమాన్ 600/580 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రెడ్డిపల్లి మరియు 500 మార్కుల పైన ప్రతిభ చూపిన నల్లమాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులైన M.భువనకృతి, M. భవ్య శ్రీ, B.మౌనిక, K.అనుదీప్, M.లిఖిత, మరియు రెడ్డిపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులైన B.సాయి కీర్తి, B.జోత్స్న, E.వైష్ణవి, మొదలగు వారిని అభినందించారు ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి G.కృష్ణప్ప మాట్లాడుతూ ఈ విజయానికి కారకులైన తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులను మండల విద్యాశాఖ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి అంజనప్ప, మండల విద్యాశాఖ అధికారి-1 K.వేమనారాయణ, మండల విద్యాశాఖ అధికారి-2 V.సురేష్ బాబు, మరియు ప్రధానోపాధ్యాయులైన S.భాస్కర్ రెడ్డి, S.జహీర్ మరియు R.రాధిక, మండల ప్రముఖులు అయినటువంటి ట్రైబల్ వెల్ఫేర్ కౌన్సిల్ సభ్యులైన సోమ్లా నాయక్ మండల కన్వీనర్ మైలే శంకర్, రామచంద్ర, బుట్టి నాగభూషణం, మంజునాథ, నాకే నాయక్, మరియు విద్యార్థుల తల్లిదండ్రులు మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిబ్బంది ఎం ఆర్ సి సిబ్బంది పాల్గొన్నారు

Posted Under AP
Editor