గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు భూమి పూజ చేసిన ఏపీ సీఎం చంద్రబాబు…

విశాఖపట్నం

గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు భూమి పూజ చేసిన ఏపీ సీఎం చంద్రబాబు.

విశాఖ జిల్లాలోని మూడు ప్రాంతాల్లో గూగుల్ ఏఐ డేటా సెంటర్ కోసం భూ కేటాయింపులు.

విశాఖ జిల్లాలోని తర్లువాడ, అడవివరం, అనకాపల్లి జిల్లా రాంబిల్లి ప్రాంతాల్లో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు 600 ఎకరాల కేటాయింపు.

15 బిలియన్ డాలర్ల పెట్టుబడి తో 1 గిగావాట్ సామర్థ్యంతో గూగుల్ ఏఐ డేటా సెంటర్.

రాత్రి గూగుల్ కంపెనీ ప్రతి నిధులకు ఆత్మీయ విందు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.

నేడు విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ కు శంకుస్థాపన సహా.. వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.

ఉదయం 08:45 గంటలకు విశాఖ పోర్టు గెస్ట్ హౌస్ నుంచి తర్లువాడకు బయలు దేరిన సీఎం చంద్రబాబు.

తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమ ప్రాంగణానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి.

ఉదయం 09:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:35 వరకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని డెలిగెట్లను ఉద్దేశించి ప్రసగించిన సీఎం.

మధ్యాహ్నం 01:55 గంటలకు సింహాచలం వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోనున్న ముఖ్య మంత్రి.

మధ్యాహ్నం 02:40 గంటలకు దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం సందర్శన
… అధికారులతో సమావేశం కానున్న సీఎం చంద్రబాబు.

సాయంత్రం 04:20 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు నుంచి అమరావతికి బయలు దేరను న్న ముఖ్యమంత్రి చంద్రబాబు.

Posted Under AP
Editor