- ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల హాస్టల్ పర్మిషన్ తీసుకోవాల్సిందే
జిల్లా విద్యాశాఖ అధికారులకు వినతులు - పర్మిషన్లు తీసుకోకపోతే హాస్టలను నడపనివ్వం-ఏఐఎఫ్‌డీఎస్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు CM సిద్దు డిమాండ్.
అనంతపురం జిల్లా కేంద్రంలో జిల్లా నలుమూలల నుండి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా విద్యాసంస్థలలో హాస్టల్లో లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వివిధ ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్ కాలేజీల హాస్టల్స్ లో విచ్చలవిడిగా ఫీజులు దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వము విద్యాసంస్థల్లో నడిపే హాస్టల్ కు ఎటువంటి పర్మిషన్లు ఇంతవరకు అనుమతులు విధి విధానాలు తయారు చేయలేకపోవడం ప్రభుత్వం చేతగానితనానికి నిలువెత్తు నిదర్శనం. అయ్యా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మీ హయాంలో ఉన్న రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో విద్యార్థులు హాస్టల్ లో చదువుతున్నారు వీరికి కనీస వసతులు లేకోకుండా చీకటి గదులలో సరైన ఆహారం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రులతో లక్షల రూపాయల దండుకొని సరైన భోజనం సరిగా లేదని హాస్టల్ సరిగా లేదని చెప్తే మీరు చదువుకోడానికి వచ్చారా తినడానికి పడుకోవడానికి వచ్చారా అని తల్లిదండ్రులను విద్యార్థులను నిర్ధాక్షణంగా విమర్శిస్తున్నారు. ఇలాంటి విద్యాసంస్థల ఆటలు కట్టించాలంటే విద్యార్థులకు న్యాయం జరగాలంటే యుద్ధ ప్రాతిపదికన తక్షణం స్కూలు మరియు కాలేజీ హాస్టల్లకు కచ్చితంగా అనుమతులు గైడ్లైన్స్ ఇవ్వాలని కోరుచున్నాము. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి ఇన్చార్జ్ డిఇఓ శ్రీనివాసులు గారికి., జిల్లా వృత్తి విద్యాధికారి గురువయ్య చిట్టి ఏఐఎఫ్‌డీఎస్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు CM సిద్దు వినతి పత్రాలు అందజేయడం జరిగింది. విద్యాధికారులు ఇది సరైన న్యాయమైన డిమాండ్ అని వెంటనే ప్రభుత్వానికి తెలియజేస్తామని విధివిధానాలు వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు.
