సే ట్రీస్ సహకారంతో హ్యాండ్స్ సంస్థ నిర్వహించిన ఎల్‌ఎస్‌సీ మీటింగ్ విజయవంతం – బత్తలపల్లి

తాడిమర్రి( yes9tv)
బత్తలపల్లి, ఏప్రిల్ 27, 2026:
బత్తలపల్లి మండలంలోని ఆర్‌కే ఫంక్షన్ హాల్‌లో అగ్రోఫారెస్ట్రీ – క్లైమేట్ ప్రూఫింగ్ ఫార్మ్ లైవ్‌లీహుడ్స్ ప్రోగ్రామ్ కింద నిర్వహించిన Local స్టాకేహోల్డర్స్ కన్సల్టెషన్ (LSC) సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని హ్యూమన్ అండ్ నేచురల్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ సొసైటీ (HANDS) సంస్థ, సే ట్రీస్ సంస్థ సహకారంతో నిర్వహించారు.
ఈ సమావేశానికి రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ వెంకట నారాయణ, ప్రోగ్రామ్ డైరెక్టర్ నారాయణ స్వామి, రీజినల్ మేనేజర్ మనోహర్, బత్తలపల్లి ఎంపీడీవో కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మల్లికార్జున, ప్రోగ్రామ్ మేనేజర్లు పీరావళి, కేశవ్, సాయిల్ ల్యాబ్ మేనేజర్ వైష్ణవి, టెక్నికల్ అసోసియేట్ సాయి చరణ్ పాల్గొన్నారు. అలాగే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు శివశంకర్, నాగలక్ష్మి, అకౌంటెంట్ భాగ్య, ఫీల్డ్ కోఆర్డినేటర్లుగా విజయ్, కిరణ్, హరి, లావణ్య, వీరనారాయణ స్వామి పాల్గొన్నారు.
ఈ సమావేశంలో తాడిమర్రి మండలం తో పాటు 5 మండలాలకు చెందిన 31 గ్రామాల నుండి సుమారు 105 మంది రైతులు పాల్గొన్నారు. ప్రారంభంలో రైతులు తమ అనుభవాలు, సమస్యలు, సూచనలు పంచుకుంటూ చురుకుగా పాల్గొని విలువైన ఫీడ్‌బ్యాక్ అందించారు.
అనంతరం అధికారులు సుస్థిర వ్యవసాయం, అగ్రోఫారెస్ట్రీ ప్రయోజనాలు మరియు వాతావరణ మార్పులకు అనుగుణమైన వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ఇప్పటివరకు ఈ ప్రాంతంలో సుమారు 1.3 లక్షల మొక్కలను రైతులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. రాబోయే సంవత్సరంలో మరో 1 లక్ష మొక్కలకు అవసరం ఉందని, వాటిని కూడా అందజేయనున్నట్లు వెల్లడించారు.
అలాగే ప్రస్తుత వేసవి కాలంలో నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని రైతులకు రక్షక తడులు (ప్రొటెక్టివ్ ఇరిగేషన్) అందించడంతో పాటు, మొక్కల పెరుగుదల కోసం గ్యాప్ ఫిల్లింగ్ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
సమావేశంలో రైతులు ఆర్గానిక్ ఎరువుల తయారీకి అవసరమైన ఇన్‌పుట్స్ అందించాలని కోరగా, ఈ విషయంపై ప్రత్యేకంగా చర్చించారు. అవసరమైన ఇన్‌పుట్స్‌ను సంస్థలు అందజేస్తాయని హామీ ఇస్తూ, వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ సమావేశం ద్వారా రైతుల్లో అవగాహన పెంపొందించడంతో పాటు సుస్థిర వ్యవసాయ పద్ధతుల అమలుకు తోడ్పడుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

Posted Under AP
Editor