బీసీల గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదు – బీజేపీ OBC మోర్చా అధ్యక్షుడు అనిల్

తాడిమర్రి (yes9tv)
సత్యసాయి జిల్లా:
బీసీల గురించి మాట్లాడే హక్కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేదని సత్యసాయి జిల్లా బీజేపీ OBC మోర్చా అధ్యక్షుడు అనిల్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో తాడిమర్రి మండలం ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గొంగటి రమేష్ పాల్గొనడం జరిగింది
1999 సంవత్సరంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో తొలిసారిగా రెండు పార్లమెంట్ స్థానాలను బీసీలకు కేటాయించి, వారికి ప్రాధాన్యత ఇచ్చింది NDA కూటమి ప్రభుత్వమేనని ఆయన తెలిపారు. అంతేకాకుండా, ఏ ఇతర పార్టీ ఇవ్వని విధంగా అసెంబ్లీ స్థానాలను కూడా బీసీలకు కేటాయించి, వారిని గౌరవప్రదమైన స్థానంలో నిలిపిందని పేర్కొన్నారు.
ఈరోజు అధికారం కోల్పోయిన వైసీపీ నాయకులు అసంబద్ధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీసీ గర్జన పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, బీసీల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహానుభావుడు జ్యోతిరావు పూలే చిత్రపటాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడం వారి వైఖరిని వెల్లడిస్తోందని అన్నారు.
వైసీపీ బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తోందని, వారి అభివృద్ధి కోసం ఏ విధమైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. 2014 నుంచి 2019 వరకు NDA ప్రభుత్వం అమలు చేసిన “ఆదరణ” పథకం ద్వారా బీసీలకు విస్తృతంగా సహాయం అందిందని గుర్తుచేశారు.
ఇప్పటికైనా వైసీపీ బీసీలపై ఉన్న పక్షపాత వైఖరిని విడనాడాలని అనిల్ సూచించారు.

Posted Under AP
Editor